TG: లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అందులో పాత్లావత్ ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ప్రవీణ్ భార్య జ్యోతి ప్రస్తుతం గర్బిణీ. స్టేషన్‌లో ఉన్న తన భర్తతో మాట్లాడించేందుకు ఓ పోలీస్ అధికారి రూ. 2 వేలు లంచం డిమాండ్ చేశారని, చివరకు వెయ్యి రూపాయలు ఇస్తే తన భర్తతో మాట్లాడించారని జ్యోతి సంచలన ఆరోపణలు చేశారు. "ఆయన దగ్గరలేకుంటే భయమైతుందన్నా! కడుపులో ఉన్న నా బిడ్డ ఆగమైతదని బుగులైతున్నదని" కన్నీరు పెట్టుకున్నారు.