నేటికి టీడీపీ ఆవిర్భవించి 44 ఏళ్లు పూర్తి

తెలుగువారి ఆకాంక్షల కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన 44వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 45వ ఏటలోకి అడుగుపెట్టింది. 1982 మార్చి 29న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను, వేధింపులను తట్టుకుని నిలబడిన టీడీపీ, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మార్గదర్శకంగా నిలిచింది. ఎన్టీఆర్ విత్తిన ఈ బీజం నేడు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహావృక్షంగా ఎదిగింది.

సంబంధిత పోస్ట్