నేటికి నాగార్జున సాగర్ శంకుస్థాపనకు 70 ఏళ్లు

కృష్ణా నదిపై నిర్మించిన అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్‌కు శంకుస్థాపన చేసి బుధవారం నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని భావించినా, అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.

సంబంధిత పోస్ట్