అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 'డ్రై డే' పాటించబడుతుంది. అక్టోబర్ 2న ఉదయం నుండి అర్ధరాత్రి వరకు వైన్ షాపులు, బార్లు, పబ్లు, స్టార్ హోటళ్లు, కల్లు కాంపౌండ్లు మూసివేయబడతాయి. తెలంగాణలోని జీహెచ్ఎంసీ పరిధిలో, ఇతర ప్రాంతాల్లో మాంసం దుకాణాలు, పశు వధశాలలు కూడా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అక్టోబర్ 3న ఉదయం నుండి యథావిధిగా అన్ని దుకాణాలు తెరుచుకుంటాయి.