ప్రస్తుత కాలంలో వాహన దొంగతనాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, రోడ్డు భద్రత సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వాళ్లు సురక్షితంగా గమ్యస్థానం చేరేందుకు తెలంగాణ రవాణాశాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రజారవాణా వాహనాలకు ‘వెహికిల్ ట్రాకింగ్ లొకేషన్ డివైజ్’లు అమర్చే ప్రతిపాదనలు ఆర్థికశాఖకు చేరాయి. దీనిని సీఎం రేవంత్ రెడ్డి ఆమోదిస్తే.. కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని, ఏజెన్సీ, డివైజ్ తయారీ కంపెనీని ఎంపిక చేస్తారు.