రైలు పట్టాలపై ట్రాక్టర్‌ పరుగులు (వీడియో)

రోడ్డుపై ప్రయాణించాల్సిన ట్రాక్టర్.. రైల్వే ట్రాక్‌పై పరుగులు తీసింది. దీన్ని స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ శివారులో కల్పన కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ 3వ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టింది. పట్టాలపై సామగ్రిని తరలించాలంటే రహదారిపై నడిచే వాహనాలకు సాధ్యం కాదు. అందుకే టైర్లకు బదులుగా రైలు బోగీలకు ఉండే ఇనుప చక్రాలను ట్రాక్టర్‌కు అమర్చి.. సులువుగా సామగ్రిని ఇలా తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్