హైదరాబాద్‌లో ఆషాడ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈనెల 13 నుంచి 15 వరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ప్రయాణికులు ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.