రైల్వేశాఖ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట రైల్వే జంక్షన్ బలార్షా సెక్షన్లో 2026 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 22 రోజుల పాటు అన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసి, దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు సుదూర ప్రాంతాల రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. ప్రయాణికులు ఈ వివరాలను గమనించాలని అధికారులు కోరారు.