ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీ ప్రభుత్వం ఖండించింది. రాష్ట్ర విభజన సమయంలో కొందరు తెలంగాణ ఉద్యోగులను ఏపీకి, ఏపీ వారిని టీజీకి కేటాయించారు. అప్పటి నుంచి వారు బదిలీలు కోరుతున్నారు. ఈ అంశం ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వం కేవలం ఉద్యోగుల మార్పిడి సమాచారం సేకరించింది. దీంతో ఏపీ నుంచి ఉద్యోగులు టీజీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది.