1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా భవన్‌లో ప్రార్థనా సమావేశంలో నాథూరాం గాడ్సే జరిపిన కాల్పుల్లో మహాత్మా గాంధీ మరణించారు. భారత జాతీయోద్యమంలో ఆయన పాత్రను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని 'అమరవీరుల దినోత్సవం'గా నిర్వహిస్తారు. ఈ రోజు గాంధీజీ ఆదర్శాలను, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేస్తుంది.