డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. 2021 జనవరి 6 నాటి దాడుల్లో పాల్గొన్న 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలోె ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.