టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రూ.10 లక్షల బీమా భరోసా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) తన 38 వేల మంది ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న ప్రమాద బీమాతో పాటు, ఇప్పుడు ఉద్యోగి సహజ మరణం సంభవించినా, వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఉచిత బీమా సొమ్మును అందించే కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకానికి ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మికులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్