తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి

తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. ఈ విధానాన్ని ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆది, సోమవారాల్లో.. రూ.300 ప్రత్యేక దర్శనానికి బుధ, గురువారం మాత్రమే లేఖలు స్వీకరించాలని TTD నిర్ణయించింది. ఒక్కో ప్రతినిది నుంచి రోజుకు ఒక లేఖకు పర్మిషన్ ఇచ్చింది. సిఫార్సు లేఖపై ఆరుగురికి శ్రీవారి దర్శన భాగ్యం కలుగనుంది.

సంబంధిత పోస్ట్