ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతా ప్రణాళికలపై టీటీడీ ఈవో శ్యామలరాావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. భక్తుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎల్అండ్‌టీ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరిచడంపై ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మరో 40 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు వారిని సూచించారు.