బీరు సరఫరా నిలిపివేతపై యూబీఎల్‌ వివరణ

తెలంగాణలో కేఎఫ్ బీర్ల సరఫరాను నిలిపివేస్తామని రాష్ట్రంలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ (యూబీఎల్‌) తెలిపిన విషయం తెలిసిందే. బీర్ల సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులపై యూబీఎల్‌ తాజాగా వివరణ ఇచ్చింది. బీరు తయారీ ముడిసరకు ధరలు పెరిగాయని, బీరు ధరలో 70 శాతం ప్రభుత్వ పన్నులే ఉంటాయని తెలిపింది. కంపెనీకి సకాలంలో చెల్లింపులు జరగడం లేదని, నష్టాలతో వ్యాపారం చేయలేకనే బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్