యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం భూమికి పయనమైంది. అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు బృందాన్ని తీసుకువస్తున్న ‘డ్రాగన్’ వ్యోమనౌక అన్‌డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. పలు విన్యాసాల అనంతరం భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యోమనౌక మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సముద్రంలో ల్యాండ్ అవుతుంది.