UPSC.. కీలక మార్పులు ఇవే

అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షల్లో ఈసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరీక్షల్లో మోసాలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ముఖ గుర్తింపును తప్పనిసరి చేశారు. ఇప్పటికే సివిల్ సర్వీసులకు ఎంపికై, మళ్లీ పరీక్ష రాయాలనుకునే వారి అర్హతలను కఠినతరం చేశారు. ముఖ్యంగా, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు ఎంపికైన వారికి ఈసారి పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఈ ఏడాది మే 24న జరగనుంది.

సంబంధిత పోస్ట్