TG: సాంకేతిక సమస్య తలెత్తడంతో రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతులకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం మరమ్మతు చర్యలు చేపట్టింది. కర్మాగారానికి రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. NFL, EIL, FCIL, గెయిల్ సంస్థల భాగస్వామ్యంతో ఈ కర్మాగారం కొనసాగుతోంది.