ఇరాన్ పైకి అమెరికా డ్రోన్ స్పీడ్ బోట్లు

మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం 30 రోజులకు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, గల్ఫ్ సముద్ర మార్గాల్లో పహారా కోసం అమెరికా మొదటిసారిగా మానవరహిత డ్రోన్ స్పీడ్‌బోట్లను మోహరించింది. ఇరాన్ దాడులను ఎదుర్కోవడానికి, సముద్ర జలాల్లో నిఘాను పటిష్ఠం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఈ వేగవంతమైన బోట్లు శత్రువుల కదలికలను సులభంగా పసిగడతాయని పేర్కొంది. గతంలో ఉక్రెయిన్ కూడా ఇలాంటి స్పీడ్‌బోట్లను రష్యాపై ఉపయోగించింది.

సంబంధిత పోస్ట్