ఇరాన్ చమురు ఉత్పత్తుల మద్దతుతో మిడిల్ ఈస్ట్‌లో అస్థిరత పెరుగుతోందని ఆరోపిస్తూ, అమెరికా ప్రభుత్వం ఆరు భారతీయ చమురు కంపెనీలపై ఆంక్షలు విధించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం, ఈ సంస్థలు 2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్యలో ఇరాన్ నుంచి మిథనాల్, టోలున్, పాలీథైలిన్ వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు టర్కీ, చైనా, యూఏఈ, ఇండోనేషియాలోని సంస్థలపై కూడా ఆంక్షలు విధించారు.