అమెరికాలో పెట్టుబడి పెట్టి గ్రీన్‌కార్డ్ పొందడానికి ఉపయోగపడే ఈబీ-5 వీసా దరఖాస్తు ఫీజులను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచాలని అమెరికా నిర్ణయించింది. ఈ మార్పు భారతీయ పారిశ్రామికవేత్తలకు గ్రీన్‌కార్డ్ పొందే మార్గాన్ని మరింత కష్టతరం చేయనుంది. ఈ నిర్ణయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈబీ-5 వీసా ద్వారా అమెరికాలో పెట్టుబడి పెట్టేవారికి గ్రీన్‌కార్డ్ లభిస్తుంది.