ఢిల్లీ నుంచి పట్నా మార్గంలో డిసెంబర్ చివరి నాటికి వందే భారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభానికి సిద్ధం కానుంది. బెంగళూరులోని బీఈఎంఎల్ ఫ్యాక్టరీలో తయారైన ఈ హైటెక్ రైలులో 16 కోచ్‌లు, 827 బెర్త్‌లు ఉంటాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో, కవచ్ భద్రతా వ్యవస్థతో ప్రయాణించే ఈ రైలు రాత్రిపూట సుదూర ప్రయాణాలకు హోటల్ లాంటి సౌకర్యాన్ని అందిస్తుంది. పలు అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఈ రైలు వారానికి 6 రోజులు నడిచే అవకాశం ఉంది.