కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. వీబీ జీ రామ్ జీ కొత్త చట్టం కింద పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచింది. అలాగే రోజువారీ వేతనాన్ని కనిష్ఠంగా రూ.300 నుంచి గరిష్ఠంగా రూ.409 వరకు చెల్లించేలా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. సిక్కింలోని కొన్ని పంచాయతీల్లో అత్యధికంగా రూ.450 వేతనం చెల్లించనుంది. ఇక వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G RAM G Act) చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.