కోల్‌కతా ఎయిర్ పోర్టులో ఇండిగో విమానాన్ని ఢీకొన్న వాహనం

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఇండిగో విమానాన్ని డ్రైవర్ లేని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. క్యాటరింగ్ ట్రక్కు విమానం కుడి ఇంజిన్ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. వాహనానికి డ్రైవర్ హ్యాండ్‌బ్రేక్ వేయకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. విమానం కోల్‌కతా నుంచి గౌహతికి వెళ్లాల్సి ఉంది. ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో వేరే విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్