బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహంపై కొందరు నిరసనకారులు మూత్ర విసర్జన చేశారు. ముజిబుర్ విగ్రహంపైకి ఎక్కి నిరసనకారుడు మూత్ర విసర్జన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిరసనకారుల చర్యపై విమర్శలొస్తున్నాయి. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో ఈ తరహా ఘటనలు పెరిగాయి.