ఆస్ట్రియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీకి అక్కడి కళాకారుల బృందం అపూర్వ స్వాగతం పలికింది. మోడీ వియన్నాకు రాగానే ఆస్ట్రియా కళాకారుల బృందం 'వందేమాతరం' ఆలపించారు. వయోలిన్, ఫ్లూట్, శాక్సోఫోన్‌లు, మరెన్నో వాయిద్యాలతో వందేమాతరాన్ని అద్భుతమైన రీతిలో వారు ఆలపించారు. 'శక్తివంతమైన సంగీత సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఆస్ట్రియాలో అద్భుతమైన ప్రదర్శనకు ధన్యవాదాలు' అని మోడీ ఈ వీడియోను ట్వీట్ చేశారు.