వర్షంలోనూ పిల్లల చదువుపై శ్రద్ధ చూపుతున్న తల్లిదండ్రులు, ట్రాఫిక్ రూల్స్ నేర్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో హ్యాండిల్ పట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదకర ప్రయాణాలపై ఆలోచించి, ట్రాఫిక్ రూల్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచిస్తున్నారు.