ఐపీఎల్ చరిత్రలో.. తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై హాఫ్ సెంచరీ సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 202 పరుగుల లక్ష్య ఛేదనలో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ, ఐపీఎల్ చరిత్రలో 4వేలకుపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్న కోహ్లీ, పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను అధిగమించాడు. మాలిక్ 557 మ్యాచ్‌ల్లో 13,571 పరుగులు చేయగా, కోహ్లీ 415 మ్యాచ్‌ల్లోనే 13,612 పరుగులు సాధించాడు.

సంబంధిత పోస్ట్