వైజాగ్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ టెండర్ల ద్వారానే దక్కింది: రాంకీ ఫార్మా

విశాఖపట్టణంలో ఫార్మాసిటీ ఏర్పాటు ప్రాజెక్టును గ్లోబల్ టెండర్ల ద్వారానే దక్కించుకున్నామని రాంకీ ఫార్మా లిమిటెడ్ హైకోర్టుకు నివేదించింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ తమ ఆస్తులను జప్తు చేసిందని, అయితే ఈ జప్తు చెల్లదని అప్పీలెట్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చిందని తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీతో పాటు రాంకీ ఫార్మా కూడా హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలవగా ప్రాజెక్టును దక్కించుకున్నామని రాంకీ తరఫు న్యాయవాది వాదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్