బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌ రేసులోకి వీవీఎస్ లక్ష్మణ్!

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవిపైనా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అగార్కర్ స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. వరుసగా సిరీస్ ఓటముల నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను తప్పించి లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా కోచ్‌గా కాదు.. లక్ష్మణ్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తారనే కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

సంబంధిత పోస్ట్