ఫోన్‌లో బడ్జెట్ పత్రాలను చూడాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి!

కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన అన్ని కీలక పత్రాలు ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌’లో అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (DG), ఫైనాన్స్ బిల్లు సహా కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా వీక్షించవచ్చు. పార్లమెంటు సభ్యులు (MPలు)తో పాటు సాధారణ ప్రజలు కూడా డిజిటల్ రూపంలో బడ్జెట్ పత్రాలను సులభంగా యాక్సెస్ చేసుకునే వీలుగా ఈ యాప్‌ను రూపొందించారు. బడ్జెట్ సమాచారం పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి రావడమే దీని ప్రధాన లక్ష్యం.

సంబంధిత పోస్ట్