శాంతి భద్రతల పరిరక్షణ కోసం, భూపాలపల్లి జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 31 వరకు పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సంకీర్ట్ తెలిపారు. ఈ కాలంలో పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించరాదని సూచించారు.