గిరిజన బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ

భూపాలపల్లిలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆయన సూచించారు. మధ్యాహ్న భోజన అమలు తీరు, వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే అంశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, వారితో కలిసి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్