మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి కురవి వెళ్లే ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలతో నిండి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. భారీ గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణం దుర్భరంగా మారిందని బాధితులు వాపోతున్నారు. ఆర్అండ్బి అధికారులు వెంటనే స్పందించి, మృత్యుకుహరాల్లా మారిన ఈ గుంతలను పూడ్చి, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.