ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి : ఎస్సై

రఘునాథపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ విలేకరులకు తెలిపారు. అక్రమ మద్యం నిల్వలు, అమ్మకాలు, బెల్ట్ షాపులు నిర్వహించవద్దని సూచించారు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే బైండోవర్ చేస్తామని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే 100 డయల్ లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ 8712685035 కు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్