జనగామ కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 247 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా పీడీ హౌసింగ్కు సంబంధించిన 56 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులకు దరఖాస్తులపై సమగ్ర విచారణ జరిపి అలర్జీదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు.