ఎన్నికల కౌంటింగ్ సెంటర్ పనులను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని ఏకశిల బీఈడీ కాలేజీలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్‌ను మంగళవారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ హాల్, టేబుల్స్ అమరికలు, భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రవేశ, నిష్కమణ మార్గాలు, తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమగ్రంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్