ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసవాల కేసులు, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో చర్చించి, ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. వార్డుల్లో రోగులకు అందుతున్న చికిత్సలను, రక్త నమూనాల సేకరణ, నిల్వ విధానాలను పరిశీలించి సరైన ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్