భరోసా షీటీం కేంద్రాన్ని ప్రారంభించిన డిజిపి

జనగామ జిల్లా కేంద్రంలో బరోసా కేంద్రం, షీ టీమ్ కేంద్రాన్ని ఆదివారం డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొన్నారు. డీజీపీకి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఘన స్వాగతం పలికారు. బరోసా, షీ టీమ్ కేంద్రంలోని వివిధ విభాగాల గదులను డీజీపీ పరిశీలించారు. అనంతరం బరోసా కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్