జనగామ మండలం అడవికేశ్వాపుర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, ఉపాధ్యాయుల బోధనా తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.