ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జనగామ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ జనగామ జిల్లాలోని ప్రధాన ఈవీఎం గోదామును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.