జనగామ: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ప్రయాణికుడు

జగద్గిరిగుట్ట నుంచి జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ కుటుంబం స్టేషన్ ఘనపూర్లో దిగుతూ తమ పర్సును అక్కడే మర్చిపోయింది. ఆ పర్సులో మొబైల్ ఫోన్, తులం బంగారం, రూ. 400 నగదు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ప్రయాణికుడైన అనంత రెడ్డి ఆ పర్సును గుర్తించి కండక్టర్ కుమార్, డ్రైవర్ రాములుకు అప్పగించారు. ఫోన్ ద్వారా బాధితులతో సంప్రదించి, వారు యథావిధిగా పర్సును వారికి తిరిగి ఇచ్చారు. విలువైన వస్తువులు తిరిగి లభించడంతో డిపో మేనేజర్ స్వాతి సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్