జనగామ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో అధికారులు విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహించి, ఇంధన కొనుగోలుపై కఠిన ఆంక్షలు విధించారు. టూ వీలర్‌కు ₹200, ఫోర్ వీలర్‌కు ₹1000, జెసిబిలకు ₹2000, హార్వెస్టర్లకు ₹3000 వరకు మాత్రమే ఇంధనం సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై వినియోగదారులు, రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు, హార్వెస్టర్లను బంకులకు తీసుకురావడం భారమని, దూర ప్రాంతాల నుండి క్యాన్లతో వచ్చినా ఇంధనం ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.