నేడు జనగామ జిల్లాలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనగామ పట్టణంలోని భరోసా కేంద్రాన్ని ప్రారంభించి, జిల్లా పోలీస్ అధికారులతో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రతపై సమీక్ష నిర్వహించనున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.