జనగామ: స్లాట్ల మాఫియా పై పోలీసుల కన్ను

జనగామ, వరంగల్ సీసీఎస్ పోలీసులు భూ భారతి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమ చెల్లింపులతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడిన కేసులో విచారణను ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టి, అధికంగా స్లాట్లు బుక్ చేసిన వారిపై దృష్టి సారించారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన నిందితుడు, ఓ విలేకరి, మరో వ్యక్తితో కలిసి ఈ దందా నడిపినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. జనగామలోని ముగ్గురు ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులతో కలిసి స్లాట్లు బుక్ చేసి, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్