మహబూబాబాద్ మండలం శనిగపురంలోని కేజీబీవీ, జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను శనివారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పిల్లల అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదులు, కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పరిసరాలను స్వయంగా పరిశీలించారు. తరగతి గదిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.