మహబూబాబాద్ జిల్లాకు కొత్త ఎస్పీగా డాక్టర్ శభరీష్ బాధ్యతలు స్వీకరణ

మహబూబాబాద్ జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ డాక్టర్ శభరీష్ ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ములుగు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన ఆయనను, ములుగు ఎస్పీగా బదిలీపై వెళ్తున్న ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన జిల్లా పరిధి అధికారులతో మాట్లాడారు. అనంతరం కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్