మహబూబాబాద్: ఎస్సై బదిలీతో సంబరాలు

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీని గ్రామస్థులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. కక్షపూరిత వ్యవహారాలు, ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసుల ఆరోపణల నేపథ్యంలో ఆయన బదిలీ అయినందుకు డీజీపీ శివధర్ రెడ్డి, మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శాబరీష్‌లకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చుతూ పండుగ వాతావరణంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్