మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం రెవిన్యూ, పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలనే ప్రధాన ఏజెండాగా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలంటే జైల్లో ఉన్న ఖైదీలను కోర్టులో సకాలంలో హాజరు పరచాలని, పెండింగ్ వారెంట్లు త్వరగా క్లియర్ చేయాలని, సాక్షులను సరైన సమయంలో హాజరు పరచాలని, విచారణ అధికారులు తమ తమ విచారణలను త్వరగా ముగించి కోర్టుకు సహకరించాలని సూచించారు