మహబుబాబాద్: మార్చురీ ఘటన ఇద్దరు ఉద్యోగులపై వేటు

మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో బతికున్న వ్యక్తిని మార్చురీకి తరలించిన ఘటనపై ఎమ్మెల్యే మురళి నాయక్ తీవ్రంగా స్పందించారు. శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే, సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వంటి ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్